వైభవంగా దత్త జయంతి వేడుకలు ప్రారంభం

2చూసినవారు
వైభవంగా దత్త జయంతి వేడుకలు ప్రారంభం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండిరామన్న దత్త సాయిబాబా ఆలయంలో మంగళవారం 48 గంటల అఖండ సాయినామం, దత్త జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయిబాబా, దత్తాత్రేయుడు, శివుడు, శ్రీరాముని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం మంగళ స్నానం, సాయిపల్లకి ఊరేగింపు, గురువారం బాబా విగ్రహానికి పాలాభిషేకం, హారతి అనంతరం అన్నదానం ఉంటుందని ఆలయ చైర్మన్ గంగోని భూరాజ్, ఈఓ భూమయ్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్