సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో శ్రీ మహ పోచమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు శనివారం పరిశీలించారు. ఈ నెల 3 నుండి 7వ తేదీ వరకు జరిగే ఈ ప్రతిష్టాపనలో రాష్ట్రం నలుమూలల నుండి, మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. దేవాదాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.