బాసరలో భక్తుల మృతి దురదృష్టకరం: కలెక్టర్

83చూసినవారు
బాసరలో భక్తుల మృతి దురదృష్టకరం: కలెక్టర్
గోదావరి నదిలో యాత్రికుల మృతిపై కలెక్టర్ అభిలాష అభినవ్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కి చెందిన భక్తులు బాసర దర్శనానికి వచ్చి గోదావరిలో స్నానం చేస్తుండగా ఐదుగురు మృతి చెందడం దురదృష్టకరమని తెలిపారు.
గతంలోనే నది సమీపంలో మెట్లు ఏర్పాటుచేసిన ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల్లో స్నానాలు నిషేధించామన్నారు. భద్రతా పరంగా నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్