అక్షరాభ్యాసం కోసం బాసరకు తరలివస్తున్న భక్తులు

1చూసినవారు
అక్షరాభ్యాసం కోసం బాసరకు తరలివస్తున్న భక్తులు
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి నూతన బాలాలయం జూలై 5 నుండి దర్శనానికి తెరవనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. బుధవారం ప్రత్యేక అక్షర మండపంలో చిన్నారులతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో అక్షర శ్రీకారాలు నిర్వహించారు. బాలాలయం ప్రారంభానికి మరో నాలుగు రోజులు ఉండటంతో, అమ్మవారి దర్శనం, అక్షరాభ్యాసం కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్