నిర్మల్ నుండి షిర్డీ వరకు భక్తుల పాదయాత్ర

2చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయి బాబా ఆలయం నుండి షిర్డీ క్షేత్రానికి సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు గురువారం పాదయాత్ర చేపట్టారు. అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో బాబాకు ప్రత్యేక పూజలు జరిపి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. లోకకళ్యాణార్థం 11వ సారి ఈ పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బాబాను వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్