దిలావర్పూర్ మండల కేంద్రంతోపాటు గుండంపల్లి, మాడేగాం గ్రామాలలో ఐజిడి ఇన్స్టిట్యూషన్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం అయోడిన్ లోపం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అయోడిన్ లోపం వల్ల కలిగే రుగ్మతలు తీసుకునే ఆహారంలో అయోడిన్ ఉండడం వల్ల సూక్ష్మ పోషకాలు ఎలా లభిస్తాయో కళాకారులచే పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఇందులో జిల్లా కోఆర్డినేటర్ ఎం హుస్సేన్, ఓఆర్డబ్ల్యు పవన్, శివ, తదితరులు ఉన్నారు.