బుధవారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో భవనంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, దివ్యాంగులు తమ హక్కులన్నింటినీ పొందాలని సూచించారు. జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలలో రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగులకు పిలుపునిచ్చారు.