సైన్స్ డ్రామాలో డిస్కవరీ డ్రీమ్స్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

1చూసినవారు
సైన్స్ డ్రామాలో డిస్కవరీ డ్రీమ్స్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
తానూర్ మండలంలోని డిస్కవరీ డ్రీమ్స్ స్కూల్ విద్యార్థులు, పాఠశాల విద్యాశాఖ, ఎస్. సీ. ఈ. ఆర్. టీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్–2026లో ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో విద్యార్థులు నాలుగో బహుమతితో పాటు కన్సొలేషన్ ప్రైజ్ సాధించారు. నిర్మల్ జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ డా. వినోద్ కుమార్, నిర్మల్ సైన్స్ బృందం విద్యార్థులను అభినందించారు. గైడ్ టీచర్ శ్వేత, సైన్స్ ఉపాధ్యాయుల కృషిని కరస్పాండెంట్ బి. రాజు, ప్రిన్సిపాల్ వల్కోడ్ పెంటాజీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కొనియాడుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్