ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ
కాంగ్రెస్ ప్రభుత్వం
బీజేపీ ఎమ్మెల్యేలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందంటూ
కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆవేదన వ్యక్తం చేయగా, తాజాగా నిర్మల్
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ డీసీసీ కూచాడి శ్రీహరి రావు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో జిల్లాలో
కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తి మరోసారి చర్చనీయాంశమైంది.