సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో బుధవారం సర్పంచ్ గుర్రం రాము గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. పశుపోషకులు తప్పనిసరిగా ఈ మందును వాడాలని, దీని ద్వారా నట్టలను నివారించవచ్చని ఆయన సూచించారు. మూగజీవాల రోగాలను ముందస్తుగా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మందులను పంపిణీ చేస్తోందని తెలిపారు.