బాసర పిఎసిఎస్ గోదాంలో డీఏపీ ఎరువుల పంపిణీ

6చూసినవారు
బాసర పిఎసిఎస్ గోదాంలో డీఏపీ ఎరువుల పంపిణీ
నిర్మల్ జిల్లాలోని బాసర (బిద్రెల్లి) పిఎసిఎస్ గోదాంలో డీఏపీ ఎరువులు అందుబాటులో ఉన్నాయని పిఎసిఎస్ చైర్మన్ అంబేకర్ సాయిరాం మంగళవారం తెలిపారు. రైతులు బుధవారం ఉదయం 10 గంటల నుండి సంబంధిత యాప్ ద్వారా బుక్ చేసుకుని, వెంటనే బాసర సేల్ పాయింట్ గోదాం వద్ద డీఏపీ ఎరువులను తీసుకోవాలని ఆయన కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంబేకర్ సాయిరాం సూచించారు.

సంబంధిత పోస్ట్