నిర్మల్ జిల్లా, ముథోల్ నియోజకవర్గంలోని తానూర్ మండలంలో కల్యాణి ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ ఆర్. శ్యామ్‌కాబాయి ఉచితంగా టీషర్ట్‌లను శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి. నరేందర్, కాంప్లెక్స్ హెచ్‌ఎం ఎన్. మల్లన్న, పాఠశాల హెచ్‌ఎం కే. బాలాజీ, ఎస్‌జీటీ ఎండీ అజహర్ పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు, పాఠశాల పురోగతికి సర్పంచ్ శ్యామ్‌కాబాయి చేసిన సేవలను విద్యాధికారులు, సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.