నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం హోలీ పండుగ సందర్భంగా బచ్పన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న రోగులతో హోలీ పండుగ ఆనందాన్ని పంచుకోవడం తమకు సంతోషాన్నిచ్చిందని బృందం సభ్యులు తెలిపారు. సమాజంలో సేవాభావంతో ముందుకు సాగడం అందరి బాధ్యత అని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.