తానూర్ మండలంలో నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

0చూసినవారు
తానూర్ మండలంలో నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్మల్ జిల్లా, తానూర్ మండలంలోని కోలూర్ గ్రామంలో బుధవారం జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్ బి. మాధవరావు చేతుల మీదుగా కార్డులను అందజేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు పేదలందరికీ అందాలనే లక్ష్యంతోనే డిజిటల్ కార్డులు ఇస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, కార్యదర్శి దత్తరెడ్డి, జీపీఓ నరేష్, డీలర్ శంకర్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సురేష్ పటేల్, భూమ రెడ్డి, వార్డు సభ్యులు, కారో బారి నర్సా రెడ్డి, వీవోఏ ముత్యం, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్