నిర్మల్ జిల్లాకు రెండు స్కోచ్ అవార్డులు లభించడం అధికారుల కృషికి నిదర్శనమని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాదులో ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. పొనికివనం, ఏర్పాటు అమ్మ రక్షిత కార్యక్రమాల అమలులో అధికారులు విజయవంతంగా కొనసాగిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఈ స్ఫూర్తితో మరింత పేరు తీసుకురావాలని సూచించారు.