జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం సాయంత్రం కడెం ప్రాజెక్టును సందర్శించి, ఆపరేటింగ్ రూమ్ ను పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం, ప్రస్తుత నీటిమట్టం, ఆయకట్ట, సాగునీటి సరఫరా వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.