సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ క్లస్టర్ సెంటర్ ను ఎన్నికల జిల్లా పరిశీలకులు అయేషా మస్రత్ ఖానం మంగళవారం పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొత్తం సాఫీగా నిర్వహించాలని, అభ్యర్థుల నుంచి స్వీకరించిన నామినేషన్ల పరిశీలన పకడ్బాందీగా చేపట్టాలని ఆమె సూచించారు.