దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైస్ మిల్లుకు గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని ఎంపీఓ, ఈఓకు శనివారం గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ కళాశాల, ఇండ్లు, దేవాలయాలు ఉన్నందున నిర్మాణం జరగకుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరేష్ కుమార్, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.