నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్ కాలనీలో బాశెట్టి సంతోష్, సాయి అనే వారి ఇంట్లో పెంపుడు కుక్క బుధవారం ఆరు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా మనుషులకు నిర్వహించే పురుడు కార్యక్రమాన్ని పెంపుడు కుక్కకు కూడా నిర్వహించడంతో కాలనీ వాసులు వింతగా చూస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.