అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామ శివారులోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్, అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.