నిర్మల్ జిల్లా కేంద్రంలో, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఎక్తాదివస్ నిర్వహించారు. పట్టణంలోని గ్రామీణ పోలీస్ స్టేషన్ నుండి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో 2కె రన్ జరిగింది. ఈ 2కె రన్ ను ఎస్పీ జానకి షర్మిల జెండా ఊపి ప్రారంభించారు. భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు.