గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం, మైక్రో అబ్జర్వర్లు తమ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ ఓటు విధానాన్ని వినియోగించుకొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, శిక్షకులు అందించిన సమాచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, ఎన్నికల విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని వివరించారు.