ఉపాధి హామీ కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి

277చూసినవారు
ఉపాధి హామీ కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి
ఎండల తీవ్రత నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ గుర్రం రాము సూచించారు. మంగళవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని పెద్ద చెరువులో పనిచేస్తున్న కూలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని వారి దాహం తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ వెన్నెల శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్