జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు, మంగళవారం సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామ ఎక్స్ రోడ్డు వద్ద యువకులకు గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ఎస్సై గోపి అవగాహన కల్పించారు. జిల్లాలో గంజాయి వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా ఎస్పీ గాంజా గస్తీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై దేవన్న, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.