జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామ బైపాస్ వద్ద శనివారం రూరల్ ఎస్సై లింబాద్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో సీటు బెల్ట్ వాడాలని ఆయన సూచించారు. వాహన పత్రాలు లేని వారికి ఫైన్ విధించారు. హెల్మెట్‌లేకుండా ప్రయాణించడం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటివి ప్రమాదాలకు దారితీస్తాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఆయన అన్నారు.