ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల మురళీకృష్ణ ఆలయం నుండి చత్రపతి శివాజీ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మెడిసెమ్మ రాజు ప్రతి ఇంట్లో భగవద్గీత, ఛత్రపతి ఫోటో, ఇంటిపై కాషాయ జెండా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హిందూ ధర్మ గ్రంథమైన భగవద్గీతను అందరూ అభ్యసించాలని, ధర్మాన్ని కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలని ఆయన సూచించారు.