మామడ చేరుకున్న రైతు గోస బీజేపీ భరోసా యాత్ర

1చూసినవారు
మామడ చేరుకున్న రైతు గోస బీజేపీ భరోసా యాత్ర
బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు గోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మామడ మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం కుప్పలను పరిశీలించి, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆరోపించారు. తాము వస్తున్నామని తెలిసి అధికార యంత్రాంగం హడావిడిగా వాహనాలను సమకూర్చిందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్