జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఆధునిక పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేయూతనివ్వాలని, పంట మార్పిడి విధానం అలవాటు చేయాలని సూచించారు. సహజ ఎరువుల వాడకం పెంచడం, భూసార పరీక్షలు నిర్వహించడం, అధిక ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. సేంద్రీయ పంట ఉత్పత్తుల డిమాండ్, ప్రాముఖ్యత, లాభాలు, సాగు మెళకువలను రైతులకు వివరించి, ప్రోత్సహించాలని సూచించారు.