
మారుతీ సుజుకీ రికార్డ్.. 3 కోట్ల వాహనాల విక్రయం
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అరుదైన మైలురాయిని సాధించింది. దేశీయంగా కార్ల విక్రయాల్లో 3 కోట్ల మైలురాయిని చేరుకున్నట్లు బుధవారం ప్రకటించింది. తొలి కోటి కార్లకు 28 ఏళ్లు పట్టగా, తర్వాతి కోటి కార్లను 7 ఏళ్ల 5 నెలల్లో, మిగిలిన కోటి కార్లను 6 ఏళ్ల 4 నెలల్లో విక్రయించింది. 3 కోట్ల అమ్మకాల్లో ఆల్టో అత్యధికంగా 47 లక్షలు అమ్ముడవ్వగా, వ్యాగనార్, స్విఫ్ట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.




