జిల్లా కేంద్రంలోని కేదార్నాథ్ జిన్నింగ్ మిల్లులో గురువారం పత్తి పంట కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరను అందించాలని, తేమ నిర్ధారణ పారదర్శకంగా జరగాలని ఆయన పేర్కొన్నారు. కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ పై రైతులకు అవగాహన కల్పించాలని, తేమశాతం లేని పంటను తీసుకువస్తే మద్దతు ధర పొందవచ్చని తెలిపారు.