నిర్మల్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం జరిగిన రైతు వారోత్సవాల కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సోమ భీంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గత పది రోజులుగా మార్కెట్ యార్డుకు తెచ్చిన మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం, గన్ని సంచుల కొరతతో ఇబ్బందులు పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నించారు. ఇదే సమయంలో గన్ని సంచులు తరలిస్తున్న లారీని రైతులు అడ్డుకున్నారు.