లక్ష్మణచందా మండలం రాచాపూర్ గ్రామంలో బుధవారం పెద్దమ్మ తల్లి ఆలయ ఐదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. మహిళలు కొత్త కుండలో బోనం వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భాజా భజంత్రీల నడుమ బోనాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. గురువారం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం, జాతర జరుగుతుందని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.