లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నిమ్మ గజేందర్, మగ్గిడి నవీన్, మగ్గిడి మహేందర్, సోన్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మేకల నిఖిల్, షికారి సాయి క్రిష్ణలు సైబర్ నేరగాళ్లతో కలిసి మోసాలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. వీరు వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి సుమారు రూ. 8.18 కోట్ల లావాదేవీలు జరిపినట్లు ఫిర్యాదులు అందాయి. ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాల వివరాలను ఇతరులకు ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు.