జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మత్స్యకారులను మత్స్య సంపద పెంపుపై దృష్టి సారించాలని కోరారు. బుధవారం సాయంత్రం నిర్మల్ రూరల్ మండలం డ్యాంగాపూర్ గ్రామంలోని చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, మత్స్య సంపద ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా బలపడవచ్చని తెలిపారు. సరైన సైజుకు రాగానే చేపలను పట్టి విక్రయించి లాభాలు పొందాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో ఏడి ఫిషరీస్ రాజనర్సయ్య, తాసిల్దార్ ప్రభాకర్, మత్స్యకారులు పాల్గొన్నారు.