నిర్మల్ జిల్లా కేంద్రంలోని డోవ్ వృద్ధాశ్రమంలో, బుధవార్ పేట్ కు చెందిన చందుల ఆశన్న మొదటి వర్ధంతి సందర్భంగా గురువారం అన్నదానం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, వృద్ధుల కోసం అన్నదానాలు చేయడం పుణ్యమని తెలిపారు. అన్నదానం చేసిన చందుల సాయన్న, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు రాము, సిబ్బంది పాల్గొన్నారు.