వడదెబ్బతో ఫారెస్ట్ బీట్ అధికారి మృతి

0చూసినవారు
వడదెబ్బతో ఫారెస్ట్ బీట్ అధికారి మృతి
మామడ అటవీ రేంజ్ పరిధిలో పనిచేస్తున్న ఫారెస్ట్ బీట్ అధికారి యాదగిరి (54) శుక్రవారం రాత్రి కనకాపూర్ లోని తన అద్దె ఇంట్లో ఆకస్మికంగా మృతి చెందారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన ఆయన స్నానం చేసి బయటకు రాగానే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది స్పందన లేకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శనివారం నిజామాబాద్ జిల్లా కిసాన్నగర్లో అంత్యక్రియలు జరిగాయి. నిర్మల్ జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖ్ దేవ్ బొబడే అటవీశాఖ తరపున రూ.30 వేలు అంత్యక్రియల ఖర్చులకు అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యాదగిరికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్