ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అటవీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు సాగిన ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ రామకృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణపై సిబ్బంది నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. ప్రకృతి సమతుల్యత కోసం వన్యప్రాణులను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు.