మాజీ మంత్రి అల్లోల పరామర్శ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

1523చూసినవారు
సీనియర్ తెలుగు పాత్రికేయుడు పురస్తు సురేందర్ కుమారుడు శ్రీ సాయి చరణ్ (22) శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అల్లోల, హుటాహుటిన జిల్లా జనరల్ ఆసుపత్రికి చేరుకొని జరిగిన ప్రమాదం విషయమై ఆరా తీశారు. శ్రీ సాయి చరణ్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆయన వెంట పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ధర్మాజీ రాజేందర్, పాకాల రామచందర్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్