నిర్మల్ జిల్లా తానూర్ మండలం జౌలా(బి) గ్రామానికి చెందిన
కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త మారుతీ ఇరవంత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి సోమవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి రాజన్న, మాజీ ఆత్మా చైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, మాజీ సర్పంచులు సాయినాథ్, అబ్దుల్ గని, నాయకులు మౌలా ఖాన్, బషీర్, పరశురాం, మారుతి, లాలప్ప, వర్లే సాయినాథ్, గణేష్, గంగారెడ్డి తదితరులు ఉన్నారు.