బోసి శ్రీ వరసిద్ధి వినాయకున్నీ దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

726చూసినవారు
బోసి శ్రీ వరసిద్ధి వినాయకున్నీ దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
తానూర్ మండలంలోని బోసి గ్రామంలో వెలసిన శ్రీ వరసిద్ధి కర్ర వినాయకున్నీ ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠ్ఠల్ రెడ్డి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ బాశేట్టి రాజన్న, పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్