కోలూర్ లో బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

624చూసినవారు
కోలూర్ లో బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
​తానూర్ మండలంలోని కోలూర్ గ్రామానికి చెందిన పి. సాయిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సోమవారం కోలూర్ గ్రామాన్ని సందర్శించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ​ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజన్న, సర్పంచ్ నిర్మలా - గణేష్, మాజీ సర్పంచ్ చంద్రకళ -శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పోశెట్టి, నర్సారెడ్డి, ధర్మేందర్, షేక్ అహ్మద్, గంగాధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్