నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎల్వీ గ్రామానికి చెందిన పోశెట్టి, ఇటీవల అనారోగ్య కారణం వలన శివాజీ పటేల్ అత్తమ్మ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి రాజన్న, మాజీ ఆత్మా చైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీటీసీ పోశెట్టి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోశెట్టి, మౌలా ఖాన్, గంగారెడ్డి, డాక్టర్ బాలు, గంగాధర్ పటేల్ తదితరులు ఉన్నారు.