నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఆర్ చిల్డ్రన్ హాస్పిటల్ లో డాక్టర్, సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడిన నలుగురు నిందితులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్సూరెన్స్ కోసం అధిక మొత్తంలో బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా, డాక్టర్ నిరాకరించడంతో పథకం ప్రకారం దాడి చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మహమ్మద్ సల్మాన్ హుస్సేన్, మహమ్మద్ షౌకత్, షాబాద్ అలీ, మహమ్మద్ ఆజాద్ హుస్సేన్ లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.