ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్స్ చట్టాల పత్రాలను దహనం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న మాట్లాడుతూ, కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని, వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.