రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలు పంపిణీ

8చూసినవారు
రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలు పంపిణీ
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు శనివారం ఉచితంగా కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాల సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, మొక్కల పెంపకం, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. ఆధునిక పద్ధతులతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి విజయ, నాయకులు లక్ష్మణ్, నామాల రమేష్, ఉద్యాన శాఖ హెచ్ఇవో సౌమ్య, కారోబర్ భోజన్న, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్