రైల్వే లైన్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలి

2చూసినవారు
జిల్లాలో ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూరు-నిర్మల్-ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని రైల్వే లైన్ సాధన కమిటీ చైర్మన్ ఎంసీ లింగన్న అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో, 2026 కేంద్ర బడ్జెట్లో ఈ రైల్వే లైన్ కు నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. నిర్మల్ మీదుగా రైల్వే లైనును తొందరగా పూర్తి చేసి, ఇక్కడి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యాటకారి సాయన్న, గొజ్జ జనార్ధన్, రాఘవులు, చాంద్ పాషా, మూర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్