బాసరలో నేడు గణపతి హోమం
నిర్మల్ జిల్లా బాసర సర్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నేడు మంగళవారం గణపతి హోమం కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు సింగారం గణేష్, కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ హోమం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామస్తులు, భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సాయంత్రం 5: 30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని ఆలయ అర్చకులు బాలకృష్ణ పంతులు తెలిపారు.