తిమ్మాపూర్ గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు

4చూసినవారు
తిమ్మాపూర్ గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు
నర్సాపూర్(జి)మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను సర్పంచ్ ఆలూరు రాజేందర్ ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో విబిజి రామ్ ప్రతినిధులు పాల్గొని గ్రామంలో ఇప్పటివరకు చేసిన పనులు, భవిష్యత్తులో చెప్పటబోయే అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ విస్తరణ అధికారి సంఘవి రైతులకు, ప్రజలకు అవసరమైన పలు అంశాలపై మాట్లాడి అవగాహన కల్పించారు. ఈ సభలో ఉప సర్పంచ్ కొత్తపల్లి నరేష్, సెక్రటరీ వనిత, కాంట్రాక్టర్ వినోద్ రెడ్డి, వార్డ్ మెంబర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్