తానూర్ మండలంలోని బెంబర గ్రామంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భజన మండలి సభ్యుల భజనలు, భక్తిపాటల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది. స్థానిక సర్పంచ్ జ్యోతి - లక్ష్మణ్, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లంబోదరునికి జైజైకారాలు పలుకుతూ, ఊరంతా ఉత్సాహంగా సాగిన ఈ యాత్రలో గ్రామస్తులు భక్తిపారవశ్యంతో మునిగితేలారు.