నిర్మల్ జిల్లా, తానూర్ మండలం ఝారి (బి) గ్రామంలో గణేష్ నిమజ్జనం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఎస్సై షేక్ జుబేర్ మరియు పోలీసు బృందం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కల్పించి, ఉత్సవం సజావుగా సాగేలా సహకరించినందుకు గ్రామస్తులు, గణేష్ మండలి సభ్యులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీసుల సేవలను గ్రామస్తులు కొనియాడారు.